తీరం వైపు దూసుకొస్తున్న అర్నాబ్ తుఫాన్తో ఉత్తరాంధ్రలో తీవ్ర భయాందోళనలు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

రాష్ట్రంలో అర్నాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, వైజాగ్, కాకినాడ, యానాం ప్రాంతాలలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు హెచ్చరించారు. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని స్పష్టం చేశారు.