ఏపీలో 10 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

రిపోర్టర్: సునీల్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 వేలకు పైగా పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఈ నెల 15న షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను ఆఫ్‌లైన్ పద్ధతిలో, మిగతా పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.