'తల్లిదండ్రులను గుర్తుంచుకుని డ్రైవ్ చేయండి': ఎంవీఐ దామోదర్ నాయుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తిలోని ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అతివేగం, హెల్మెట్ లేకపోవడం, సెల్ఫోన్ డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకుని నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మన్యం నరసింహులు, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి మ్యాగీ క్లారా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.