దేవుడి భూములు దళితుల భూములు దోచుకున్నారు అద్దంకి దయాకర్

రిపోర్టర్: అశోక్ స్థలం: Telangana

దేవుడి భూములు, దళితుల భూములను దోచుకున్నారంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని, దళితుల భూములు, అసైన్డ్ భూములు, భూదాన్ భూములను సైతం వదలకుండా దోచుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.