వినాయక చవితి రద్దీతో కిక్కిరిసిన హైదరాబాద్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
వినాయక చవితి పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో భాగ్యనగర వాసులు సొంతూళ్లకు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసి, రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.