'దేశ సమగ్రతను కాపాడుకోవాలి': సికింద్రాబాద్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వీర సైనిక్ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర సాయుధ బలగాల కవాతును తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన ఈ చారిత్రక సందర్భంలో దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని ప్రముఖులు పిలుపునిచ్చారు.