ఉస్మానియా యూనివర్సిటీలో నేతకాని సంఘం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
నేతకాని కులస్తులకు జరిగిన అన్యాయంపై వచ్చే నెల 15న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత తెలిపారు. జన్నారం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ హలో నేతకాని చలో ఉస్మానియా నినాదంతో సభ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కులస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.