గాయని మాధురి రాథోడ్ కేసులో మరోసారి కొత్త ట్విస్ట్

రిపోర్టర్: విజయ్ స్థలం: రంగారెడ్డి

ఫోక్ సింగర్ మాధురి రాథోడ్ మోసం కేసులో నార్సింగి పోలీసులు వేగం పెంచారు. ఈశ్వర్ సాయిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. 16 రోజులు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో మాధురి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈశ్వర్ సాయితో పాటు మరో ఇద్దరిపై కొత్తగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.