తాడేపల్లిగూడెంలో మార్గదర్శి చిట్ ఫండ్ 134వ శాఖ ప్రారంభం

రిపోర్టర్: మహేష్ స్థలం: పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మార్గదర్శి చిట్ ఫండ్ 134వ శాఖను సీఈవో పాతూరి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. రామోజీరావు స్థాపించిన మార్గదర్శి సంస్థ, సామాన్య ప్రజల కలల సాకారానికి, ఆర్థిక ఆసరాకు నిదర్శనమని ఆయన కొనియాడారు. స్థానికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నూతన బ్రాంచ్ ఎంతో ఉపయోగపడుతుందని, ఖాతాదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.