రూ.1.75 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం స్వాధీనం
రిపోర్టర్: శేఖర్
స్థలం: నర్సంపేట
నెక్కొండ మండలంలోని గర్నపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంపై టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జితేందర్‌రెడ్డి ఇంట్లో జరిపిన తనిఖీల్లో సుమారు యాభై క్వింటాళ్ల విరిగిన బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని నెక్కొండ పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేపట్టారు.