హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం మూడేళ్ల బాలుడు మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజ్హాన్ ఉద్దీన్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్వీకార్ హోటల్ వద్దకు వెళ్లిన బాలుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.