ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని సీపీఎం సామూహిక ధర్నా
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ వాసులకు పొజిషన్ సర్టిఫికెట్లు కాకుండా శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది. కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక సచివాలయం వద్ద సామూహిక నిరసన ధర్నా చేపడుతున్నట్లు పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగేశ్వరరావు తెలిపారు. పేదల గృహ హక్కుల కోసం జరిగే ఈ ఆందోళనకు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.