వాట్సప్ అప్డేట్: అకౌంట్ లేని వారికీ వాయిస్, వీడియో కాల్స్ సదుపాయం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
వాట్సప్ వినియోగదారులకు ప్రముఖ టెక్ సంస్థ మెటా తాజాగా సరికొత్త ఫీచర్ను పరిచయం చేసిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ అప్డేట్ ద్వారా వాట్సప్ ఖాతా లేని వారు కూడా గెస్ట్ రూపంలో వాయిస్ లేదా వీడియో కాల్స్ లో పాల్గొనే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. లింక్ ద్వారా ఎవరైనా ఈ కాల్ లో చేరవచ్చని, భద్రతాపరమైన జాగ్రత్తల కోసం హోస్ట్ అనుమతి తప్పనిసరి అని కంపెనీ స్పష్టం చేసింది.