లో సిక్కిం రాపర్ యుజెన్ నమ్‌గ్యాల్ భూటియాపై దాడి

రిపోర్టర్: రమేష్ స్థలం: అరుణచల్ ప్రదేశ్

లోని లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో సిక్కింకు చెందిన ప్రముఖ రాపర్ యుజెన్ నమ్‌గ్యాల్ భూటియాపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అరినిలో జరిగిన ఫెస్టివల్ ముగించుకుని రోయింగ్కు తిరిగి వస్తుండగా తివారి గావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, అరుణచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుతో మాట్లాడి రాపర్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఖండు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా, పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.