కోరుట్ల మార్కెట్ లో అధికారుల ఆకస్మిక తనిఖీలు: అధిక ధరలకు విక్రయిస్తే కేసులు
రిపోర్టర్: గోపి
స్థలం: కోరుట్ల
కోరుట్ల పట్టణంలో పౌరసరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని డీఎస్ఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మార్కెట్ లో బియ్యం కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని, నిల్వలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు.