కాకినాడలో ఆపరేషన్ త్రిశూల్: గంజాయి నిర్మూలనపై పోలీసుల విస్తృత అవగాహన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ పోలీస్ వెల్లడించారు. మత్తు పదార్థాలు మరియు గంజాయి నిర్మూలనతో పాటు మహిళలు, పిల్లల భద్రత మరియు రోడ్డు ప్రమాదాల నివారణపై స్థానిక ప్రజలు, యువతకు పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొంటూ అధికారులు స్పష్టం చేశారు.