పాములా మెలికలు తిరుగుతూ సాగే యర్రగొండపాలెం కొప్పుకొండ ఘాట్ రోడ్డు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మార్కాపురం

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని కొప్పుకొండపై శిథిలావస్థకు చేరిన వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కొత్త ఆలయ నిర్మాణ సామగ్రి తరలించేందుకు ఆలయ కమిటీ కొండపైకి ఒక ప్రత్యేక మార్గాన్ని వెడల్పు చేసింది. కింద నుంచి పైకి కిలోమీటరు దూరం ఉన్న ఈ దారి పాములా మెలికలు తిరుగుతూ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.