ఇరాన్పై త్వరలో మరో భీకరదాడి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

రిపోర్టర్: సునీల్ స్థలం: వాషింగ్టన్

ఇరాన్పై త్వరలో మరో భీకరదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం స్పష్టం చేశారు. ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ అణు ఆకాంక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే ఏ క్షణంలోనైనా సైనిక చర్య చేపట్టవచ్చని పేర్కొన్నారు. అదే సమయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇరాన్ తీరును బట్టే భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని తేల్చిచెప్పారు.