సీరోల్ ఎంపీడీవో కార్యాలయంలో ఉద్రిక్తత మహిళపై దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు
రిపోర్టర్: అశోక్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సీరోల్ ఎంపీడీవో కార్యాలయంలో ఇంటి రిజిస్ట్రేషన్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం వచ్చిన ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన వెంకటమ్మపై ఎంపీడీవో మహమ్మద్ గౌస్ బాటిల్ విసిరి దాడి చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పుతుండటంతో నిలదీసిన బాధితురాలి ఎడమ చేతికి గాయమైందని, బాధ్యుడైన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఎంపీడీవో ఖండించారు.