అల్లు వారింట ఘనంగా వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
అల్లు సినిమాస్ లో వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అల్లు కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అల్లు శిరీష్, స్నేహారెడ్డి, అయాన్, అర్హ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఈ వేడుకకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకాకపోవడం గమనార్హం.