ఖమ్మంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేసి మండపాల నుంచి రూట్ మ్యాప్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. గణేష్ నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని అధికారులు సూచించారు.