ఐసీఏఆర్ పీజీ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్ పీజీ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను అక్టోబర్ తొమ్మిదో తేదీన విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. కౌన్సెలింగ్లో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తు సంఖ్యను ఉపయోగించి ఫలితాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. సీట్లు పొందిన వారు అక్టోబర్ పదో తేదీలోగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి, సీటు అంగీకార రుసుం చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు.