అన్నమయ్య జిల్లా అభివృద్ధికి రూ.180.99 కోట్ల నిధులు మంజూరు
రిపోర్టర్: రమేష్
స్థలం: అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధికి ఎస్ఏఎస్‌సీఐ పథకం కింద కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.180.99 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో డిజిటల్ విద్య, పాఠశాలల్లో మౌలిక వసతులు, రవాణా సదుపాయాలను మరింత బలోపేతం చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రత్యేక నిధుల కేటాయింపు ద్వారా జిల్లా ప్రగతికి నిరంతర ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంటూ బీజేపీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా వివరాలు పంచుకున్నాయి.