దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కాంగ్రెస్ తీరుపై తీవ్ర దుమారం

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

రాముడు ధనికుల దేవుడంటూ, శివుడు పేదల దేవుడంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీ వేదికగా ఆయన ఆర్య-ద్రావిడ వాదాన్ని తెరపైకి తెస్తూ దేవుళ్ల మధ్య వర్గ విభజన ఆపాదించారని విమర్శకులు మండిపడుతున్నారు. బీజేపీ హిందూత్వ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కొత్త వ్యూహాలకు తెరలేపిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజంలో తీవ్ర చర్చకు దారితీశాయి.