విజయనగరంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా విజయనగరం కోట కూడలి వద్ద భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పాల్గొని దీపాలు వెలిగించారు. దేశానికి మోదీ చేస్తున్న సేవలను వారు కొనియాడారు.