తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో కలకలం: అధికారుల పెత్తనంపై సిబ్బంది తిరుగుబాటు
రిపోర్టర్: విజయ్
స్థలం: సికింద్రాబాద్
కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటైన తార్నాక ఆర్టీసీ దవాఖాన ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారిందని అంతర్గత వర్గాలు వెల్లడించాయి. అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందిన ఒక ఉన్నతాధికారిణి పెత్తందారీ ధోరణి కారణంగా వైద్య విధుల్ లో గందరగోళం నెలకొందని, సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.