లక్నోలో షాకింగ్ ఘటన: లీవిన్ భాగస్వామి మృతిపై శ్రద్ధా దూబే సంచలన వీడియో
రిపోర్టర్: అశోక్
స్థలం: లక్నో
లక్నోలో తన లీవిన్ భాగస్వామి శివ శర్మ ఆత్మహత్య చేసుకున్నాడని మోడల్ శ్రద్ధా దూబే వెల్లడించారు. అప్పుల బాధ వల్లే అతను బాల్కనీ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆమె స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై వస్తున్న హత్య ఆరోపణలను శ్రద్ధా దూబే తీవ్రంగా ఖండించారు. మృతుని తల్లి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.