మెగా డీఎస్సీ ఎంపికలో అక్రమాలు: ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కర్నూలు
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025 ఎంపిక ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో విద్యాశాఖ సీరియస్ అయ్యింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు పాఠశాలలో క్రీడా కోటా కింద జరిగిన ఎస్‌జీటీ పోస్టు కేటాయింపుపై ఉన్నతస్థాయి విచారణకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులెవరూ తప్పించుకోలేరని విద్యాశాఖ స్పష్టం చేసింది.