గ్రామాల సమగ్ర అభివృద్ధికి పకడ్బందీ ఏర్పాట్లు అంటూ కాకర్ల సురేష్ వెల్లడి

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆంధ్రప్రదేశ్లో గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూ.10 వేల కోట్ల భారీ వ్యయంతో పల్లె పండుగ మూడో విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈ అభివృద్ధి పనులను పారదర్శకంగా అమలు చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు.