దుబాయి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక ఇబ్బందుల కష్టాలు
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
దుబాయి వేదికగా జరగనున్న అంతర్జాతీయ లేజర్ రన్ ఛాంపియన్‌షిప్‌నకు రాజాం విద్యార్థిని కిల్లారి త్రివేణి ఎంపికైందని, అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా దుబాయి పంపేందుకు లక్షల్లో ఖర్చు భరించలేకపోతున్నామని వారు వాపోయారు. జాతీయస్థాయిలో సత్తాచాటిన ఈ ప్రతిభావంతురాలిని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.