ఎస్ఐ వెంకన్న మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: కొత్తగూడెం

హైదరాబాద్ గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్తగూడెం టూ-టౌన్ ఎస్ఐ కె. వెంకన్న మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం అభినందనీయమని కొనియాడారు. మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.