మణిపూర్ లో భీకర కాల్పుల కలకలం: ముగ్గురు ఉగ్రవాదులు మృతి

రిపోర్టర్: మహేష్ స్థలం: Noney

మణిపూర్ లోని నోనే జిల్లా తౌదైజంగ్ గ్రామంలో రెండు వేర్వేరు ఉగ్రవాద వర్గాల మధ్య జరిగిన భీకర కాల్పుల్ లో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. జెలియాంగ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. మరోవైపు కాంగ్పోక్పి జిల్లాలో గిరిజన ఐక్యతా సమితి బంద్ ను పొడిగించింది. శాంతిభద్రతలను కాపాడేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని వర్గాలు వెల్లడించాయి.