నాటు కోళ్ల పెంపకంతో సిరులు కురిపిస్తున్న పాముకుంట రైతు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంట గ్రామానికి చెందిన రైతు ఎడ్ల నరేష్ రెడ్డి వ్యవసాయంతో పాటు నాటు కోళ్ల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం ఆర్జిస్తున్నాడు. తన బావి వద్ద రెండు ఎకరాల స్థలంలో పండ్ల తోటల మధ్య కోళ్లను పెంచుతూ నెలకు నలభై వేల రూపాయల వరకు లాభాలు గడిస్తున్నాడు. ఈ వినూత్న ఉపాధి మార్గం ద్వారా ఇతర రైతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.