ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డిని, వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది.