రోలుగుంట మండలంలో తొలిరోజు ఘనంగా ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
రిపోర్టర్: G TAMMUNAIDU
స్థలం: రోలుగుంట
రోలుగుంట మండలంలో తొలి రోజు నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజే వివిధ రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొత్తం పద్నాలుగు సెగ్మెంట్లకు సంబంధించి పద్నాలుగు నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి కొండలరావు తెలిపారు. అభ్యర్థులు భారీ జనసందోహంతో వచ్చి నామినేషన్ పత్రాలను అందించారు.