ఆర్టీసీ మహిళా కార్మికుల నారీ బేరి సభలో కూనంనేని సాంబశివరావు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఉప్పల్ బండి ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్టీసీ మహిళా కార్మికుల నారీ బేరి బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎస్.బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న తదితరులు వేదికపై ఆసీనులై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.