పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం: కూలిపోయిన ట్రైనర్ జెట్, ఇద్దరు మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: బలూచిస్థాన్

పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. నవాన్ కిల్లీ పట్టణ సమీపంలో శిక్షణ సమయంలో సైన్యానికి చెందిన పీఏసీ ఎంఎఫ్ఐ-17 ముష్షాక్ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. సాంకేతిక లోపమే ఈ విపత్తుకు ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు సైనిక ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.