ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రులు
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి దిగడం అనాగరికమని విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు రాళ్లు, కోడిగుడ్లతో అల్లర్లకు పాల్పడటాన్ని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా ఖండించారు. క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించిన టీచర్లపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.