అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న హుస్సేన్నగర్ పల్లెసీమ

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం హుస్సేన్నగర్ గ్రామంలో సర్పంచ్ పాలన 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గ్రామ సర్పంచ్ జిల మల్లేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో హుస్సేన్నగర్ను మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.