గ్రామీణ వైద్య సేవలకు పెద్దపీట: పలాసలో కొత్త హెల్త్ క్లినిక్ ప్రారంభం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొద్దబద్ర గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు సామాజిక భవనాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ప్రాథమిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య రక్షణ లభించనుంది.