సాఫ్ట్వేర్ రంగానికి భారీ షాక్: ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదన్న శ్రీధర్ వేంబు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

సాఫ్ట్వేర్ రంగానికి భవిష్యత్తు అత్యంత సవాలుగా మారిందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ విస్తరణ వల్ల పెరుగుతున్న వ్యయాలతో ఈ ఏడాది ఉద్యోగులకు సాధారణ జీతాల పెంపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినందుకు సిబ్బందికి బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. లేఆఫ్స్ను అడ్డుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నామని తెలిపారు.