సౌదీ అరేబియాలోని కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై హూతీల దాడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: రియాధ్
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడికి పాల్పడినట్లు ప్రకటించారు. విమానాశ్రయ పరిధిలోని ఇంధన నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు హూతీ సైనిక ప్రతినిధి యహ్యా సారీ వెల్లడించారు. అయితే ఈ దాడి జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి స్వతంత్ర ధృవీకరణ రాలేదు.