ఎల్‌నినో దెబ్బకు పల్నాడులో ఎండుతున్న పత్తి మిరప పంటలు
రిపోర్టర్: నరేష్
స్థలం: పల్నాడు
ఎల్‌నినో ప్రభావం మరియు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పల్నాడు జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేకపోవడం మరియు భూగర్భ జలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తి, మిరప పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. మొక్కలు మోకాళ్ల ఎత్తుకే పరిమితమై పూత దశలోనే రాలిపోతుండటంతో పాటు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువైంది. భారీ పెట్టుబడులు పెట్టి కౌలు చెల్లించిన రైతులు, పంట చేతికొచ్చే పరిస్థితి లేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.