ఇంటర్ మయామి అకాడమీని నాపిల్స్ కప్ గెలిపించిన మెస్సీ కుమారుడు
రిపోర్టర్: రమేష్
స్థలం: World
అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ కుమారుడు మాటెయో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఇంటర్ మయామి అకాడమీకి కెప్టెన్‌గా వ్యవహరించి నాపిల్స్ కప్ టైటిల్‌ను సాధించిపెట్టాడు. ఫ్లోరిడాలో జరిగిన కోపా నాపిల్స్ టోర్నమెంట్‌లో ఈ యువ ఆటగాడు జట్టును విజయపథంలో నడిపించాడు. ట్రోఫీతో మాటెయో సంబరాలు చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.