చెన్నారం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు: విద్యార్థినుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం పాండవ చలక కాలనీ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు కన్నులపండువగా సాగాయి. ప్రధానోపాధ్యాయురాలు రహేనా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినుల కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి చలపతిరావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనమని కొనియాడారు. అనంతరం వేడుకల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేయగా, ఉప సర్పంచ్ నెమలి జ్యోతితో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.