పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు.. నవంబర్‌లో పట్టాల పంపిణీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సుమారు 4,800 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. అక్టోబర్‌లో అర్హుల తుది జాబితా సిద్ధం చేసి, నవంబర్ నుంచి అర్హులైన పేదలకు కొత్త ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.