స్పీకర్‌ను బెదిరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలకే ప్రమాదకరం: మంత్రి శ్రీధర్ బాబు
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
శాసనసభ స్పీకర్‌ను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బెదిరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలకు అత్యంత ప్రమాదకరమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. అసెంబ్లీని ఎలా నడపాలో స్పీకర్‌కు హుకుం జారీ చేయడానికి ప్రతిపక్షాలు ఎవరని నిలదీశారు. సభాపతి స్థానంపై జరిగిన దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.