అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న 'తెల్ల కాగితం' చిత్రం

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న 'తెల్ల కాగితం' చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను దిల్ రాజు, బాబీ ఆవిష్కరించారు. 2000 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ, అమాయకపు ప్రేమను ప్రతిబింబిస్తుందని, కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.