నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌తో రాబోతున్న రణబాలి చిత్రం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలికి సంబంధించి చిత్రబృందం ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. సినిమా మేకింగ్ విశేషాలను వివరిస్తూ నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. 19వ శతాబ్దపు నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చేసిన పరిశోధన, సెట్స్, కాస్ట్యూమ్స్ విశేషాలను ఇందులో చూపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.