మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సీఐ సతీశ్ కుమార్ హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పిናగడిలోని వెలగపూడి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కేవీ సతీశ్ కుమార్ మాట్లాడుతూ చదువుకుంటున్న యువత క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను, కుటుంబాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాల రవాణా, నిల్వ చేసినా చట్టంలో కఠిన శిక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.